చివరిగా న్యాయమును

( సామెతలు 17:14 )
" కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. "

మనమందరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి ఇతర వ్యక్తులతో కలిసి జీవించటం.
మనము విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న స్వభావాలు కలిగిన వారముగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చాము. ఎవరైనా మనతో ఏకీభవించనప్పుడు లేదా మనకు నచ్చనిది వారు చేస్తున్నప్పుడు, వారితో వాగ్వాదం చేయడం, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించి, మన అభిప్రాయాన్ని నిరూపించుకొనటము సులభమే. కొంతకాలం ముందు మనము పరస్పరం పోరాడి, ఒకరిపై ఒకరు మనస్తాపం చెంది మనం ఉద్రిక్తతకు మరియు ఒత్తిడికి లోనయ్యాము. దానికి కారణం మనము గొడవలను అనుమతించాము. మనము పరిధి దాటి, అగౌరవపరిచే మాటలు, బాధ కలిగించే కార్యములు మరియు కించపరిచే విషయాలను చేసినప్పుడు, మనము మన సంబంధాలను దెబ్బతీసి , కలహాలకు తలుపులు తెరిచాము. అందుకే శత్రువుకు చోటు ఇవ్వవద్దు అని వాక్యము చెబుతోంది. గొడవలు వూరకనే రావు, నీవు వాటికి తలుపు తెరవాలి. మనము వాదనలు చేయకపోయినా లేదా తప్పుడు మాటలు చెప్పకపోయినా కానీ మనము కలహాలు సహజం అని వాటిని ఆత్మలో ఖండించి వదిలివేయనప్పుడు , శారీరకముగా వాటిని అనుమతిస్తున్నామని అర్ధము. వాటిని అనుమతించినప్పుడు మనము నిరంతరం వాదించుకుంటాము, బాధ కలిగించే విషయాలు చెబుతుంటాము, అగౌరవంగా ఉంటాము అందువలననే మనము తప్పు మార్గంలోనే పయనిస్తుంటాము. కలహాలు చెలరేగకుండా వుండడానికి మరియు సంబంధాలను విచ్ఛిన్నం చేయకుండా వుండటానికి ముందుగా గొడవలను ఆపాలి. అందుకు నిన్నునీవు తగ్గించుకోవాలి. చివరిగా న్యాయమును జరిగించువాడు దేవుడేనని ఆయనకు నీ వ్యాజ్యములను అప్పగించు కోవాలి.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, నేను ఉన్నత మార్గంలో వుండి సంబంధాలలో శాంతిని కొరుకున్నప్పుడు మీరు దీవెనను వాగ్దానం చేసినందుకు వందనములు. కలహాలు సృష్టించే విధ్వంసక శక్తిని గుర్తించి, దానికి చోటు ఇవ్వకుండా నా నోరు మూసుకుని, నన్ను ఇబ్బంది పెట్టే విషయాన్ని ఎప్పుడు పట్టించుకోకూడదో తెలుసుకోనే జ్ఞానం నాకు దయచేయుమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమేన్.