దేవుని నమ్ము
( రోమీయులకు 4 : 19-21 )
"మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుకాక, ...అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక...దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను."
ఆబ్రహాము 'విశ్వాసులకు తండ్రిగా' పిలువబడుట మనకు తెలుసు , కాని తన జీవితములో దేవుని వాగ్ధానమును నమ్మటానికి ఎన్నో పరిస్థితులు ఆటంకముగా నిలిచాయి. దేవుడు అతనిని జనములకు తండ్రివి అవుతావు అని అన్నారు. దేవుని వాగ్ధానము నెరవేరటానికి అప్పటికే అబ్రాహాముకు 90 యేండ్లు దాటిపోయింది. ఎంతమంది ఆ వయస్సులో అద్దముచూసుకుంటూ, లేదు అది జరుగనే జరుగదు అని చెప్పుతూ వారి అవిశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. కానీ ఈ దినవాక్యము సెలవిస్తూంది అతడు తన శరీరమును పట్టించుకొనక , దేవుని వాగ్ధానము నెరవేర్చని తన శరీరబలహీనతలను వెదకుకొనకుండా దానికి బదులు దేవుని బలాన్ని , లేనివాటిని వున్నవిగా చూపగల ఆయన శక్తిని నమ్మేను .
మనకు ఏమార్గమూ తోచని పరిస్థితులలో దేవునికి మార్గము తప్పకా దొరుకుతుందని అబ్రాహాముకు తెలుసు. తాను నమ్మదగినదేవుని కలిగివున్నాడని అబ్రాహాముకు తెలుసు, కనుకనే ఆయనకు సకల స్తుతి, ఘనత, మహిమలు అతడు చెల్లించెను.
అతని విశ్వాసము అతడికి ద్వారములు తెరవబడటానికి, దేవుడు బలముగా పనిచేయటానికి కారణమైనది.
ఈ దినము నీవు దేని కొరకు దేవుని విశ్వసించుచున్నావు? అది అసాధ్యమైనదిగా వున్నదా? చాలా కాలమైనదా? అయినాగాని దేవుని నమ్ము. ఆయన వాక్యమును నమ్ముకో . ఆయన విశ్వాస్యతను నమ్ముకో. అబ్రాహాములాగ, నీవు ఆయనను మహిమపరచుచుండగా ఆయన వాక్యముపైననే నీ పూర్ణ విశ్వాసాన్ని పెట్టు. నీవు నమ్ముచూ,నిరీక్షిస్తూ వుండగా నీ విశ్వాసము నీ జీవితములోని ప్రతీ భాగములో గొప్ప జయము మీకు అనుగ్రహించును.
ఈ విధంగా ప్రార్ధన చేద్దామా: తండ్రీ ఈ దినము నా జీవితములో మీ విశ్వాస్యత బలముగా పనిచేయు చున్నందులకు వందనములు.
నాకున్న పరిస్థితులలో. నేను, మీ మీదనే నా మనస్సంతా పెట్టుకున్నాను నాకున్న బలము , సామర్ద్యము మీరే ,సకల స్తుతి ఘన మహిమలు మీకే చెల్లించుచు ఏసునామములో వేడుకొనుచున్నాను తండ్రీ ! ఆమెన్.