అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని, ... మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను. రోమీయులకు 4:23-24
చాలా తరచుగా మనము మన ఉద్యోగమును మన గుర్తింపుగా చెపుతుంటాము.
“నీవు ఎవరు?” అని నీవు ఒకరిని అడగినప్పుడు, వారు “నేను నర్సుని” అని సమాధానం ఇస్తారు. కానీ సత్యము ఏమిటంటే, అది వారు చేసేపని, కాని అది వారు ఎవరో అనికాదు.
నీవు సర్వోన్నతుడైన దేవుని బిడ్డవు. అదీ నీవిలువ. - అనగా నీవు చేసే పని వలన కాదు గాని, నీవు ఎవరు అనే దానివలననే నీకు విలువ వస్తుంది. నీవు కొన్ని తప్పుపనులు చేసివుండవచ్చు, ఆ తప్పులు నీవు తిరిగి చేయకుండా జాగ్రత్తపడగలవు, కానీ నీవు ఆ తప్పు కాదు. నీ విలువ నీ సృష్టికర్త నుండి వచ్చినందున, నీ వలన జరిగినది ఏదీ నీ విలువను మార్చదు. కాబట్టి నీవు ఎవరివో తెలుసుకో.
నీవు నీ పట్ల నమ్మకముగా ఉన్నప్పుడు, నీవు దేవునితో ఏకీభవిస్తావు. నీవు పొరపాటు చేస్తే, క్షమించమని నీవు దేవుణ్ణి కోరిన క్షణం, ఆయన నిన్ను క్షమించడమే కాదు, దానిని మరచిపోతారు, ఇక జ్ఞాపకము చేసికొనరు. దేవుడు మరచిపోయినదాన్ని నీవు గుర్తుంచేసికోవడం మానుకో. నీవు ఏవికాదో అది నీవే, అని చెప్పే నిందారోపణలన్నింటినీ వినడం మానుకో. నీ పనితీరు సంపూర్ణంగా లేకపోయినా కానీ నీ విశ్వాసం ద్వారా నీవు అంగీకరించబడతావు మరియు ఆమోదించబడతావు. అది దేవునికి ముఖ్యమైనది.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, నీవు అబ్రాహాము దేవుడవు మరియు నా దేవుడవు అని మీకు వందనములు. మీరు నన్ను అంగీకరించినది మరియు ఆమోదించినది నా విశ్వాసం వల్లనే గాని, నా పనితీరు వల్ల కాదు అని మీకు వందనములు చెల్లించుచున్నాను.
నేను ఎవరో నాకు తెలియచేసినందులకు వందనములు మరియు నేను ఉత్తమ వ్యక్తిని కావడానికి నాకు సహాయం చేయమని అడుగుచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.