Elohim Church /Mettuguda /Secundrabad.... మీరు చదువు చున్న ఈ దైవ వాక్యము, విని గ్రహించి ఇతరులను కూడ దైవ వాక్యము లోనికి నడిపించండి.????????
నీవు ఆశ్చర్యపోతావు
(1 రాజులు 7:1 )
“అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.”
ఇశ్రాయేలీయుల ఆహార సరఫరాను నిలిపివేసి మరియు వారికి నీళ్ళు రాకుండా చేయటానికి నీటి మార్గాలకు అడ్డుకట్టలు వేస్తూ ఒక సైన్యం సమరియ నగరాన్ని చుట్టుముట్టింది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు . వాటిని గూర్చి ఎలీషా రాజుతో మాట్లాడినప్పుడు, అతను తన మనస్సును కోల్పోయి మాట్లాడుతున్నాడని వారు భావించారు. అయితే ఒక నాయకుడు, "దేవుడు పరలోక కిటికీలు తెరిచినా అది జరగదు" అని అన్నాడు. ఇంకా నీవు తరువాత వచనములను చదవడం కొనసాగిస్తే, ఎలిషా చెప్పినట్లే అద్భుతం జరిగింది, మరియు అకస్మాత్తుగా ఆహారం పుష్కలంగా దొరికింది.
అసాధ్యం అనిపించే కొన్ని విషయాలు అవి వెనుతిరుగటం లేదా జరగడం చూసి నీవు ఆశ్చర్యపోతావు. నీవు సహజంగా చూస్తున్నావు, కాని మనము ఆశ్చర్యకరుడైన దేవుని కలిగివున్నాము.కనుక దేవునితో ఏకీభవించు. విషయాలు చోటుచేసుకుంటాయని, అవకాశం నీకు రాబోతోందని నమ్ము. వూహించలేని రీతిలో ప్రజలు తమ మార్గం నుండి బయటకువచ్చి నీకు మంచిగా ఉంటారు. నీవు దీనిని జరిగించలేవు. అది దేవుని హస్తమే.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నేను మిమ్మును నమ్మినప్పుడు, దేవదూతలు నా వెనుక పని జరిపిస్తారని, చీకటి శక్తులు వెనక్కి నెట్టబడతాయని, మరియు విషయాలు నాకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయని మీకు వందనములు . అది మీరు రేపు లేదా వచ్చే ఏడాది దీన్ని చేసినా, మీరు నా ప్రతీ అవసరాన్ని చూసుకుంటారని, అది దారిలో ఉందని నేను నమ్ముతూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.