Elohim Church/Mettuguda/Secundrabad
దేవుని వాక్యము వింటున్న మీరు, మరి కొందరికి ఈ వాక్యమును పంపించండి ????????

అది దేవుని హస్తం

( అపో.కార్యములు 8:26 )
“ప్రభువు దూత నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.”

సమరయలో సువార్తను ప్రకటించడంలో ఫిలిప్పు గొప్ప విజయాన్ని సాధించాడు.
ఆ ఎడారి రహదారికి బయలుదేరమని ఒక దేవదూత ఫిలిప్పుతో చెప్పినప్పుడు, అక్కడ ఇథియోపియా కోశాధికారి అయిన ఒక వ్యక్తి, రథంలో ప్రయాణిస్తూ యెషయా గ్రంధమును చదువుతున్నాడు. యేసయ్య రక్షకుడిగా ఎలా వచ్చాడనే దాని గురించి యెషయా మాట్లాడుతున్నాడని ఫిలిప్పు అతడు చదువుచున్న భాగమును అతనికి వివరించినప్పుడు, ఆ వ్యక్తి నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు మరియు అతని జీవితం శాశ్వతంగా మారిపోయింది.

ఈ మనిషిలాగే, నీవు దేవుణ్ణి గౌరవిస్తున్నందున, ప్రస్తుతం నీ రథాన్ని వెంబడిస్తున్న ఫిలిప్పులు ఉన్నారు. నిన్ను అభిషేకించటానికి దేవుడు నియమించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, వారి ప్రభావాన్ని, వారి జ్ఞానాన్ని మరియు వారి అనుభవాన్ని తీసికొని నిన్ను ముందుకు నెట్టడానికి ఉపయోగించే వ్యక్తులు వున్నారు. నీవు దేవుని వాక్యమునే ధ్యానిస్తూ దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, ప్రభువు సన్నిధికి వెళ్ళడానికి సమయం తీసుకున్నప్పుడు, నీ మార్గములో ఈ వారంలోగాని, ఈ నెలలోగాని ఎప్పుడైనా, అలాంటి ఫిలిప్పు కనిపిస్తాడు ఆశ్చర్యపోకు. అసాధారణమైనది ఏదో జరుగుతుంది, ఊహించని ఆశీర్వాదం ఎదురవుతూంది. అది దేవుని హస్తం.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నా ఉద్దేశ్యమునకు నన్ను ముందుకు కదిపే మంచి విరామాలు, సరైన కనెక్షన్లు, అవకాశాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసునని మీకు వందనములు. నేను మిమ్మల్ని మొదటి స్థానంలో ఉంచినప్పుడు, మీ మంచితనం ఆశీర్వాదాల వర్షం కుమ్మరిస్తుందని వందనములు. నా ఆశీర్వాదము ఇప్పటికే దారిలో ఉందని నమ్ముచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.