నీవు ఉన్నతమైన దారిలో
( ఆదికాండము 30:27,28 )
“అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను… మరియు అతడు నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.”
యాకోబు చాలా సంవత్సరాలు తనకు అబద్ధాలు చెప్పి, మోసం చేసి మరియు అన్యాయంగా ప్రవర్తించిన మామ అయిన లాబాను వద్ద పనిచేశాడు. యాకోబు కోపంతో వెళ్ళిపోయి వుండవచ్చు, కానీ అతను ఉన్నతమైన దారిలో వెళ్లాడు మరియు ఉత్తమముగా కొనసాగాడు.
మరియు యాకోబు జీవితంపై దేవుని అనుగ్రహం ఉన్నందున లాబాను పశుసంపద బాగా పెరిగింది. అయితే యాకోబు చివరకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, లాబాను అతడిని ఉండమని వేడుకున్నాడు. నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోని వ్యక్తులు నీ జీవితములో ఉండవచ్చు. నీవు ఎవరో వారికి విలువ లేదు. మనస్తాపం చెందక యాకోబులాగ సరైనదే చేస్తూ ఉండు. వారు ఇప్పుడు నిన్నులెక్కించక పోవచ్చు, కానీ నీ వలన వారు ఆశీర్వదించబడ్డారని వారు గుర్తించే సమయం వస్తుంది, చివరకు వారు ఏదయినా చేసి నిన్ను నిలుపుకోవాలని చూస్తారు. యాకోబు వెళ్లినప్పుడు, అతను ధనవంతుడు కాదుగాని , అతడు గౌరవముతోను, మర్యాదతోను తాను చాలా సంవత్సరాలుగా కష్టపడిన, అతనికి ఇవ్వని వాటిని వదలి అతను వెళ్ళిపోయాడు. దేవుడే నీ న్యాయాధికారి. నీవు ఉన్నతమైన దారిలో ఉంటే, దేవుడే సమస్తమును నీకు సమకూరుస్తారు.
ఈ విధంగా ప్రార్థన చేద్దామా : తండ్రీ, నాకు జరిగిన ప్రతిదాన్ని మీరు చూసినందుకు వందనములు. నేను ప్రతి అన్యాయాన్ని విడిచిపెట్టి, చేదుతనము రాకముందే త్వరగా క్షమించగలిగినందుకు వందనములు. మీరు నా తప్పులను సరిదిద్దుతూ, నా పక్షమున ప్రతీకారం తీర్చు దేవుడవని నేను ప్రకటించుచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.