Elohim Church/Mettuguda/Secundrabad
లోతుగా నివసించాలని

( యెషయా 32:17)
“ నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు “

నీవు గాజువలె ప్రశాంతంగా ఉన్న ఒక కొలనులోకి ఒక రాయిని విసరినప్పుడు, ఇది మొత్తం కొలను ఉపరితలం అంతటా తరంగాలను పంపుతుంది. అది ప్రశాంతముగా వున్న స్థితిలో ఒక పెద్ద భంగం కలిగించినట్లు కనిపిస్తోంది. కానీ నిజానికి, ఉపరితలం నుండి క్రింద అడుగు భాగములో ప్రశాంతముగా మరియు శాంతియుతంగా ఉంటుంది. ఉపరితలంపై జరిగినది ఏదీ లోతైన నీటిని ప్రభావితం చేయదు. అది ప్రశాంతంగా ఉంటుంది.

నీవు ఎంత సులభంగా కలత చెందగలవు ? నీ జీవితం అనే కొలనులోకి విసరబడిన గులకరాళ్ళు వలన నీవు నిరాశ చెంది , అది నీ ఆనందమును దొంగిలించి ఉంటే, గమనించు నీవు విశ్వాసంలో ఇంకా లోతులకు వెళ్ళాలి. అనగా "నీవు పని చేసేచోట నీ పదోన్నతి ఆగిపోయింది!" అనేది ఒక గులకరాయి. "ఆమె నన్ను బాధపెట్టింది!" ఆనేదీ మరొక గులకరాయి. "నీకు రావలసిన రుణము తిరస్కరించబడింది!" అన్నవి కేవలం ఉపరితలం కలత పరచే గులకరాళ్ళు మాత్రమే. ఆ విషయాలు చాలా తేలికగా తీసికుంటున్నామని కాదు, కానీ నీవు ఉపరితలం నుండి లోతునకు వెళ్ళినప్పుడు, దేవుడు నీ కొరకు అద్భుతం చేయటానికి ఇంకా సింహాసనంపైనే వున్నారని గ్రహించగలుగుతావు.
ఆ లోతైన ప్రదేశములోనే నీవు నివసించడానికి నిర్ణయించుకున్నప్పుడు నీవు సమాధానముతోను, శాంతితోను జీవించగలుగుతావు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రి, సమస్తమైన నా సమాధానమునకు కర్తవని మీకు వందనములు. నేను మీకు దగ్గరగా వచ్చి మరియు మీలో లోతుగా నివసించాలని కోరుకొనుచున్నాను.
ఇతరులు నా జీవిత పరిస్థితులలో చెప్పే వాటినిబట్టి నా ఆనందం దొంగిలించబడటాన్ని నేను తిరస్కరించుచు, నేను శాంతిగా వుంటానని , నిశ్చలనముగా వుంటానన ప్రకటించుచూ యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమెన్.