మెరుగుపెట్టిన అంబుగా

( యెషయా 49:2 )
“ నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు. “

దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, అయిన కొన్ని సమయాల్లో నిన్ను దాచిపెడతారని నీకు తెలుసా? ఆయన నీ సహోద్యోగికి ప్రమోషన్ వచ్చేలా చేస్తారు. నీవు ప్రతిభావంతుడవే అయిన నిన్నుదాచి ఉండవచ్చు, అభిషేకించబడివుండవచ్చు అయిన దాచబడ్డావు మరియు గొప్ప ఆలోచనలు వున్నాయి అయిన దాచబడ్డావు. దేవుడు నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేయటానికి దాచిపెడుతున్నాడని నీవు అర్థం చేసుకోకపోతే, నీవు విసుగు చెంది నీ స్వంతంగా పనులు జరిగేలా ప్రయత్నిస్తావు. నీ మేలులను నీవు అనుభవించే ముందు, నీవు ఒక అస్పష్టమైన కాలమును చూస్తావు. ఆ దాచబడివున్న కాలములో కొన్ని పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. మోషే ఇశ్రాయేలీయులను దాస్యత్వము నుండి బయటకు తీసికొనిరావటానికి నలభై సంవత్సరాలు దాచబడి వుండవలసి వచ్చింది. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత గొర్రెల కాపరుల పొలాల్లో దాచబడ్డాడు. ఏలీయా సారెపతు‌లో ఒక విధవరాలు మరియు ఆమె కొడుకుతో మూడున్నర సంవత్సరాలు దాగి ఉన్నాడు. అయితే ఇది నీవు మేలు పొందవలసిన ప్రక్రియలో ఒక భాగం. నీవు ఈ అస్పష్టమైన సమయములలో నమ్మకంగా ఉన్నప్పుడు, నీకు అర్థం కానప్పుడు కూడ సరైన పని చేసినప్పుడు, నీవు ఆ పరీక్షలో ఉత్తీర్ణతను సాధిస్తున్నావు.
నీవు కలలుగన్న దాని కంటే ముందుకు దేవుడు నిన్ను తీసుకెళ్లడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, మీరు నన్ను దాచిపెట్టినప్పుడు అస్పష్టంగా వున్న కాలము‌లతో సహా, నా జీవితమును గూర్చిన మీ ప్రణాళికను మీ ఉత్తమ మార్గంలో అమలు చేస్తున్నందుకు వందనములు. మీరు నా కోసం కలిగి ఉన్న తదుపరి దాని కోసం నన్ను సిద్ధం చేస్తున్నందుకు వందనములు. ఎల్లప్పుడూ మీకు నమ్మకంగా ఉండటానికి మరియు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి నాకు సహాయం చేయుమని యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.