అని ప్రశ్నించుకోవాలి

“ నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు … వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?
ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.” ( యెషయా 58:7,8 )

చాలా తరచుగా పదోన్నతిలోనో, స్వస్థత లోనో , కొత్త స్థాయి లోనో మనపై వెలుగు ఉదయించాలని ఎదురుచూస్తుంటాము. మరి నీవు వెలుగుగా వున్నావ ? నీవు నీ కలలను సాకారం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరులకు ఒక ఆశీర్వాదంగా, ఇతరులకు సేవచేయడంపై నీ దృష్టి కేంద్రీకరిస్తే, నీవు మరింత దీవెనలను పొందుతావు.
నీవు సేవ ద్వారా వారికి ప్రయోజనకరముగా వున్నప్పుడు, నీవు తెరవలేని పురోగతులు, పదోన్నతులు తలుపులు తెరచుకోవటమును నీవు చూడబోతున్నావు.

నీకు ఇబ్బంది కలిగించే వాటి నుండి విరామం తీసుకో. నీకు కావలసిన వాటి నుండి, నీవు అనుకున్న వాటి మీద నుండి నీ దృష్టి మరొకరికి మేలుగా ఉండే దానిపై పెట్టు. నీవు ఇతరులకు సేవ చేసినప్పుడు, అది నీవు విత్తుతున్న విత్తనం. దానికి దేవుడు నిన్ను ఆశీర్వదించబడేలా చేస్తారు. మరియు ప్రజలు నీ యెడల మంచిగా ఉండేలా చూసుకుంటారు. నీకు మంచి విరామము‌లు లభించకపోతే, నిన్ను నీవు ఎలా ప్రశ్నించుకోవాలి అంటే - “నేను ఎవరికైన మంచి విరామము‌లు ఇస్తున్నానా? నేను చేయాల్సిన పనిని నేను చేస్తున్నానా ? నేను ప్రజలకు అనుకూలతను చూపుతున్నానా ? నేను అదనపు మైలుకు వెళ్తు సేవచేస్తున్నాన ?" అని ప్రశ్నించుకోవాలి.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, మీరు నన్ను ఎప్పుడూ చీకటిలో వదిలిపెట్టనందుకు లేదా తాళం వేసిన తలుపుల వెనుక చిక్కించకున్నందుకు మీకు వందనములు. ఇతరులకు సేవ చేయడాన్ని నేను నా బాధ్యతగా చేస్తున్నందున, మీ కాంతి నాపై ఉదయింపచేసినందుకు మీకు వందనములు. నేను ఇతరులను ఆశీర్వదించినట్లే నేను కూడా ఆశీర్వదించబడేలా మీరు తప్పకుండా చేస్తారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నానుతండ్రి ! ఆమెన్.