అతను "ఇంకొకసారి"

(న్యాయాధిపతులు 16:28)
“అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి “

దేవుని ప్రజలను వారి శత్రువుల నుండి విడిపించేందుకు సమ్సోను‌కు అతీంద్రియ బలం ఇవ్వబడింది మరియు అతడికి ఓటమికలుగలేదు, కాని అతను తన నైతిక రక్షణను పోగొట్టుకొని, తన బలాన్ని కోల్పోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు మరియు బానిసగా చేయబడ్డాడు. అతనిలో తప్పు వుంది, అయినాగాని దేవుడు మనలను ఎప్పుడూ వదులుకోరు. బందీలు ఒక రోజు సమ్సోనును ఎగతాళి చేస్తున్నప్పుడు, అతను "ఇంకొకసారి" బలము నివ్వమని ప్రార్థించాడు, దానికి ఆ ఆలయంయొక్క మూలస్తంభాలను నెట్టడానికి, తద్వార భవనం కూలిపోవడానికి మరియు తను జీవితకాలంలో కంటే తన మరణంలో ఎక్కువ మంది శత్రువులను చంపడానికి దేవుడు సమ్సోను‌కు బలాన్ని ఇచ్చారు.

నీవు తప్పులు చేసి ఉండవచ్చు, కానీ నీ కథ ఆ విధంగానే ముగియకూడదు. నీ గొప్ప విజయాలను నీవు ఇంకా చూడలేదు. నీవు నీ ఉత్తమ పాట ఇంకా పాడలేదు. నీవు నీ ఉత్తమ పుస్తకం ఇంకా వ్రాయలేదు. నీవు నీ ఉత్తమ ఆట ఆడలేదు. నీవు నీ అపరాధభావాన్ని వదులుకున్నట్లయితే, దేవుడు నీ దారికి మరోసారి వస్తారు. నీవు ఊహించిన దానికంటే పెద్దది, మరియు గొప్ప బహుమతి నీకొరకు ఉంది.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, మీరు నేను నెరవేర్చగల గమ్యముకొరకు నన్ను పిలిచినందులకు వందనములు. మీరు నన్ను విమోచించినందుకు ధన్యవాదాలు, మరియు మీ కరుణ నా తప్పులను మరియు నా వైఫల్యాలను కప్పిపుచ్చుతూందని వందనములు.
మీకు దగ్గర ఎల్లప్పుడూ “మరొకసారి” అనేది ఉందని తెలిసి నేను ముందుకు వెళ్తుతూ యేసు నామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.