నమ్మకం నిజమయింది
“ ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.” ( మార్కు సువార్త 10:47 )
బర్తమయి అనే గుడ్డి భిక్షగాడు యేసయ్య ఆ మార్గమున ప్రయాణిస్తున్నారని విని, యేసు, దావీదుకుమారుడా, నాపై దయ చూపండి! అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. సాంకేతికంగా, యేసయ్య యోసేపు మరియు మరియల కుమారుడు. కాని బర్తమయి ఆయనను దావీదు కుమారుడా అని పిలిచాడు, అది పాత నిబంధనలో మెస్సయ్య బిరుదు, ఎందుకంటే అతను యేసును మెస్సీయగా గుర్తించాడు. అతడు యేసయ్యకు మొరపెట్టినప్పుడు, "నువ్వు నా మెస్సీయా, నా విమోచకుడవు, నన్ను స్వస్థపరచువాడవైన, సర్వోన్నతుడైన దేవుడు అని పలుకుతున్నాడు. " నన్ను కరుణించు అనగానే ! యేసయ్య తన బాటలో ఆగిపోయారు. ఆయన ఆలోచించడాన్ని నేను ఊహించగలను, ఇక్కడ నేను ఎవరో తెలిసిన వ్యక్తి, నాకు శక్తి ఉందని నమ్మే వ్యక్తి, నా మంచితనాన్ని ఆశించే వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు అనుకొని వుండవచ్చు. అతని నమ్మకం నిజమయింది.
యేసయ్య బర్తమయిని స్వస్థపరిచినప్పుడు, ఆయన నీతో కూడా ఏమి చెబుతున్నారో తెలుసా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది, నీ విశ్వాసం కార్యములను మలుపు తిప్పుతుంది, సరైన తలుపులు తెరుస్తుంది మరియు ఊహించని అనుగ్రహాన్ని తెస్తుంది. దాని కొరకు ఎదురుచూపు కలిగి ఉండు. దేవుడు నీ దారిగా వస్తున్నారు. నీ విశ్వాసాన్ని విడుదల చేయు. నీవు అనుకున్నదానికంటే ముందుగానే నీలో దేవుని కార్యము జరగబోతోంది.
ఈవిధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, మీరు బర్తమయి దృష్టిని పునరుద్ధరించినట్లే, మీరు నా జీవితంలో అసాధ్యమైన పనిని చేయగలరని మీకు వందనములు. నా హృదయ కోరికలను నేను మీ ముందుకు తీసికొని రాగలిగినందులకు వందనములు. మీరు చేయగలిగే పెద్ద కార్యముల కోసం ధైర్యంగా మిమ్మును అడగడానికి మరియు నా విశ్వాసాన్ని విడుదల చేయడానికి నాకు సహాయము చేయుమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి! ఆమేన్.