విడుదల వస్తోంది
(మార్కు సువార్త 5:27-28)
“ ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. “
మార్కు సువార్త 5వ అధ్యాయములో ఒక స్త్రీ రక్తస్రావం రుగ్మతతో పన్నెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉంది. ఆమె ఎంతో మంది ఉత్తమ వైద్యుల వద్దకు వెళ్ళింది, వివిధ మందులు ప్రయత్నించింది, కానీ ఏమీ పని చేయలేదు. అయితే ఆమె "నేను ఎప్పటికీ బాగుపడను, నేను దానితో జీవించడం నేర్చుకోవాలి" అని అనుకోవచ్చు. కాని ఆమె తాను ఆరోగ్యంగా ఉండాలని ఆమెకు బాగా తెలుసు. ఒకరోజు యేసయ్య ఆ ప్రాంతము గుండా వెళుతున్నారని విన్నప్పుడు, ఆమె నిరీక్షణతో నిండిపోయింది. ఆమె కూడ ఆగుంపు గుండా వెళ్ళడం ప్రారంభించింది, మరియు ఆమె, "నాకు స్వస్థత వస్తోంది, పునరుద్ధరణ వస్తోంది, విడుదల వస్తోంది." అని మళ్లీ మళ్లీ చెప్పుకుంది. అదే విశ్వాసముతో ఆమె యేసయ్య వస్త్రం అంచుని తాకినప్పుడు, ఆమె వెంటనే స్వస్థత పొందింది. ఈ దినము కూడా ఆత్మదేవుడు నీ కళ్ళముందుకు తీసుకొని వచ్చిన వాగ్ధానమును పట్టుకొనవచ్చు. ఎప్పుడయితే నీవు నిరీక్షణతో జీవిస్తున్నావో, అది దేవుని దృష్టిని నీవైపు త్రిప్పుతుంది. నీవు ప్రతీరోజు బయటకు వెళ్ళేముందు "దేవా, నేను నాకలలు నెరవేరడం, వాగ్దానాలు నెరవేరడం, సంబంధాలు పునరుద్ధరించడం మరియు నా విధి యొక్క కొత్త స్థాయిని చూడబోతున్నానని నేను నమ్ముతున్నాను" అని ప్రార్థించుతున్నప్పుడు, ఈ స్త్రీ చేసినట్లుగానే నీవు నీ విశ్వాసాన్ని కనుపరచుతున్నావు. నీ విశ్వాసం దేవుణ్ణి నీ గమ్యమువైపునకు నడుపగలదు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, నా విశ్వాసం మరియు నిరీక్షణ మీరు అద్భుతమైన కార్యములు చేయడానికి మార్గాన్ని తెరవగలవని మీకు వందనములు. నేను ఈరోజు విశ్వాసంతో నిన్ను చేరుకుంటున్నాను. మీరు నా కొరకు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నారని, పరిస్థితులు నాకు అనుకూలంగా మారుతున్నాయని మరియు విజయం చేరువలో వున్నదని నేను నమ్ముచూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రీ ! ఆమెన్.