అదే ప్రశ్న దేవుడు మనలను
( మత్తయి 20: 31-32 )
“ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి… యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా “
అది ఆ గ్రుడ్డివారికి అవసరం అని స్పష్టముగా అనిపించింది. యేసు ఎందుకు వారిని అడిగారు ? వారు వేటిని నమ్ముతున్నారో చూడాలని ఆయన కోరుకున్నారు. "యేసు, మేము ఆహారము కొనడటము కోసం నగదు అవసరం” అని వారు అడగివుండవచ్చును. వారు పరిమిత మనస్తత్వంతో అడిగినట్లయితే, అది వారిని ఓటమిపాలు చేసివుండేది. కాని దానికి బదులుగా వారు పెద్దగా అడిగారు. "ప్రభువా, మేము చూడాలనుకుంటున్నాము." అని వారు చెబుతున్నారు, మరియు "మీరు అసాధ్యమైనవి చేయగలరని మాకు తెలుసు." అని నమ్మకము తెలిపారు. యేసయ్య వారి అభ్యర్థనను విన్నప్పుడు, ఆయన వారి కళ్ళను తాకగా తక్షణమే, వారు చూడగలిగారు.
అదే ప్రశ్న దేవుడు మనలను అడుగుతున్నారు : "మీ కోసం నేను ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు?" ఇప్పుడు, దేవుడు ఏమి చేయాలో అనేది నీవు ఇచ్చే సమాధానంపై గొప్ప ప్రభావం కలిగి వుంది. "దేవా నా ఉద్యోగం గురించి నాకు సహాయం చెయ్యండి.” అని అడుగవద్దు. "దేవా నా కుటుంబము మొత్తం మీకు సేవ చేయాలనుకుంటున్నాను." "దేవా , నా ఇంటి రుణాన్ని చెల్లించాలనుకుంటున్నాను." అని ఇంకా పెద్దది అడగడానికి ధైర్యం చేయు. నీ కలల కోసం అడగు. అసాధ్యం అనిపించే విషయాలు గూర్చి అడుగు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: "తండ్రి, మీరు ఆ గ్రుడ్డివారి యొక్క దృష్టిని పునరుద్ధరించినట్లుగానే, మీరు నా జీవితంలో అసాధ్యం చేయగలరని మీకు వందనములు.
నా హృదయాశలన్నీ మీ సన్నిధికి తీసికొనిరాగలుగు చున్నందులకు వందనములు. తండ్రి మీరు మాత్రమే జరిగించగల కార్యములను అడుగునట్లు నాకు కావలసిన ధైర్యమును దయచేయుమని యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమెన్.