అనే మాటల శక్తిని

( సామెతలు 18:4)
"మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి."

ప్రజలు దాహంతో అలమటిస్తు, అవస్థలు పడుతున్నారు. వారు జీవితంలో ముందుకు భారముగా కదులుతున్నారు. మనం వారికి వైద్యం గురించి ఆలోచించినప్పుడు, వారి గురించి మనము ప్రార్థన చేయవచ్చును, కానీ మనము పలికే మాటలకు జీవాన్ని ఇచ్చే, స్వస్థపరిచే శక్తి ఉందని మనం గ్రహించాలి. నీవు దయగా ఉన్నప్పుడు, నీవు ప్రోత్సహించినప్పుడు, నీవు ఏదైనా మంచిని గురించిఆలోచించడమే కాకుండా, దానిని నోటితో చెప్పడానికి సమయాన్ని వెచ్చించినప్పుడు, నీవు స్వస్థతనిచ్చేవానిగా వున్నావు. “నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు దీన్ని చేయబోతున్నావు “అనే ఒక దయగల మాట యొక్క శక్తి, సాధారణ పొగడ్త యొక్క శక్తి, నీ నుండి గొప్ప విషయాలు ఎదురుచూస్తున్నాము" అనే మాటల శక్తిని మనం గుర్తించలేము.
నీ మాటలు నీకు సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ దేవుడు వాటికి జీవాన్ని ఇచ్చినప్పుడు, అవి అవతలి వ్యక్తికి అసాధారణమైనవి అవుతాయి.

ఈ దినము ఎవరికైనా నీ వైద్యనిచ్చే మాటలు కావాలి. ఆశీర్వాదం లేకుండా ఎవరైనాగాని నిరాశను అధిగమించలేరు. నీవు ఒక అడుగు ముందుకు వేసి ప్రోత్సహించకపోతే ఎవరైనా తమ కలను వదులుకుంటారు. నీవు ఈ రోజు వైద్యం చేస్తావా ? ప్రజలను ఉద్ధరించడానికి నీవు పదాలను ఉపయోగిస్తావా?

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, మీరు నా జీవితంలో ఉంచిన వ్యక్తులనుబట్టి వందనములు. నేను మిమ్మువలెనే వారిని ప్రేమించాలనుకుంటున్నాను. నా సాధారణ పదాలను ఇతరులకు జీవాన్ని ఇచ్చేవిగా మార్చగలిగినందుకు వందనములు. మీరు నన్ను ఒక వుత్తేజపరచేవాని‌గా, ఒక స్వస్థత నిచ్చేవానిగా మారుస్తున్నారని నేను నమ్ముచూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమేన్.