దీవెనలవర్షము

( కీర్తనలు 68:9 )
“ దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.”

జీవితం పట్ల మన అభిరుచిని కోల్పోవడం సులభమే. ఒక సమయంలో మనము నవ్వటానికి ఇష్టపడ్డాము, ఆ రోజు కోసం ఎదురుచూశాము, ఆ కలల నెరవేర్పుకోసం నమ్మకం పెట్టుకున్నాము, కానీ మనం అనుకున్నట్లుగా పనులు జరగనప్పుడు, మనము నిర్జన ప్రదేశంలోకి వచ్చినట్లుండి మన జీవితం దాని రుచిని కోల్పోయింది. మనము నవ్వుతాము, కానీ దాని వెనుక ఆనందం లేదు. కొన్నిసార్లు మనం అలసిపోయి వేసారిపోయినట్టువుంటాము, సవాళ్లు మనం అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి, మరియు మనము వాటిని ఎన్నటికీ అధిగమించలేనట్లు వున్నాము.
అది ఎవరో మన యెడల చేసిన తప్పుకు మనం ఆరిపోయినట్లుండి దానిని వదిలేయడానికి బదులుగా మనము చేదుగా మారాము. నీవు నీ ఆలోచనా జీవితాన్ని నియంత్రించాల్సి వచ్చినప్పుడు దానికి ఏదీ అర్థములేనట్లు కనిపిస్తుంది.

అక్కడే యుద్ధం మొదలవుతోంది. నీకు ఏమి జరుగుతుందో దేవుడు చూస్తున్నారు, మరియు ఆయన నీకు బలమును, ఆనందంను, ఆరోగ్యమును మరియు వనరులను సమృద్ధిగా ఇవ్వబోతున్నారు. నీవు ఆ ఆరిపోయిన ప్రదేశంనుండి తగినంత కంటే ఎక్కువగా వున్నప్రదేశమునకు వస్తున్నావు. నీ ఆశలు పెంచుకో. సమృద్ధిగల వర్షాన్ని ఆశించడం ప్రారంభించు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, కొన్నిసార్లు నేను కనుగొన్న పొడి ప్రదేశాలకు మీరు పరిమితం కానందుకు వందనములు. నేను ఏమి చేస్తున్నానో మీరు చూస్తున్నందుకు, మరియు మీరు దీవెనలవర్షము సమృద్ధిగా పంపుతున్నందులకు వందనములు.
నేను నా గతవిజయాలు నా భవిష్యత్తులో నాకు ఇవ్వబోయే విజయాలతో సరిపోలవని నమ్ముతూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.