వెనుక జరిపిస్తున్న

( రూతు 2:16 )
“ మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.”

రూతు తన స్వదేశమును విడిచిపెట్టిన ఒక యవ్వన విధవరాలిగా వృద్ధాప్యంలో వున్న తన అత్తను జాగ్రత్తగా చూసుకుంటుంది . ఆమె పొలమునకు వెళ్ళి, క్రింద పడిన ధాన్యాన్ని ఏరుకొని, జీవించడానికి ప్రయత్నిస్తున్నది. బోయజు, ఆ పొలమునకు యజమాని. రూతు గురించి తన పనివారితో మాట్లాడి, ఆమెకు సుళువు చేయటానికి ఉద్దేశించి భూమిపై ధాన్యాన్ని కొన్ని పికెళ్ళు వదిలివేయమని చెప్పాడు. అతను రూతుతో మాట్లాడలేదు; అతను రూతు గురించి మాట్లాడాడు. బోయజు వారికి ఏమి చెప్పాడో ఆమె విన్ననప్పటికీ, ఆమెకు అకస్మాత్తుగా అవసరమునకు మించి ఎక్కువ ధాన్యం దొరకటము వలన ఆమె పని సగం సమయంలోనే పూర్తి అయ్యింది. ఎందుకంటే ఆమె కోసం ఒకరు పలికిన కొన్ని మంచి మాటల వలననే అది జరిగింది. అదే విధంగా, సరైన తలుపులను తెరవడానికి, నీకు అనుకూలతను చూపించడానికి దేవుడు నీ కొరకు సరైన వ్యక్తులతో నిన్ను గూర్చి మంచిగా మాట్లాడారు.
రూతు మాదిరిగా, హఠాత్తుగా నీవు కష్టము చేయని ఆశీర్వాదాల్లోకి వస్తావు. నీవు విజయవంతం కావడానికి సహాయపడటానికి ప్రజలు వారి మార్గాలను మించి నీ కొరకు బయటకు వస్తారు. అది ఎందుకు జరిగిందో నీకు ఎప్పటికీ తెలియదు. అది వాటిఅన్నింటిని కలిపి వెనుక జరిపిస్తున్న దేవుని కార్యము.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రి, నేను ఎదుర్కొన్న మరియు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికరమైన మరియు కష్టమైన పరిస్థితి మీకు తెలుసునని మీకు వందనములు.
- నేను కనిన కలలన్నింటి కంటే ఎక్కువగా మీ ఆశీర్వాదం మరియు దయ నాపైన ఉందని నేను నమ్ముతున్నాను.
వాటినన్నింటిని కలిపి తీసుకొని రావటానికి నా వెనుక మీరు పని జరిగించుచున్నారని నమ్ముచూ యేసునామములో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.