పొంగిపొర్లుతుంది

( ఆదికాండము 28:3 )
“ సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి… “

నీవు ఆశీర్వాదం పొందాల్సిన అవసరం లేదని కొన్నిసార్లు వ్యక్తులు నిన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. కాని దేవుని పేర్లలో ఒకటి "ఎల్ షద్దాయి", అనగా "సర్వశక్తిమంతుడైన దేవుడు" అని అనువదించబడింది మరియు "తగినంత కంటే ఎక్కువ" అని దీని అర్థం.
నీవు జీవితంలో తగినంతగానే వుండాలని దేవుడు కోరుకుంటే, ఆయన పేరు "తగినంత కంటే ఎక్కువ" అని పేరు ఎలా పెట్టుకుంటారు? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న పొంగిపొర్లుతున్న దీవెనలను దాటి ప్రజలు నీతో మాట్లాడనివ్వవద్దు.

నీవు సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, తద్వారా నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలవు. నీవు ఆనందంతో నిండివుంటే, నీవు ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని తీసుకుపోగలవు. నీవు నీ చుట్టూ ఉన్న వారికి సహాయపడే అనేక వనరులను కలిగి ఉన్నావు. నీలో సృజనాత్మకత, ప్రతిభ, ఆలోచనలు పొంగిపొర్లుతున్నాయి. నీ జీవితం గొప్ప వ్యక్తులతో నిండివుంది. ప్రభావంతో, గౌరవంతో, ప్రమోషన్‌తో పొంగిపొర్లుతుంది. నీవు దీన్ని ఇంకా చూసి ఉండకపోవచ్చు, అయితే దేవుడు నీలో ఈ కొత్త కార్యము చేయబోతున్నారు. పొంగిపొర్లే అనుభవములోనికి నీవు రాబోతున్నావు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, మీరు ఎల్ షద్దాయ్, తగినంత కంటే ఎక్కువగల దేవుడవని , మరియు నా జీవితం ఆశీర్వాదాలతో పొంగిపొర్లాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు వందనములు. నేను మీతో ఏకీభవించగలిగినందుకు వందనములు మరియు మీరు కొత్త కార్యము చేయబోతున్నారని నమ్ముతున్నాను. పొంగి పొర్లే అనుభవము నా దారిలోకి వస్తున్నట్లు నేను ప్రకటించుచూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.