ఎక్కడకుచేర్చాలో ఎలాచేర్చాలో
( యెహోషువ 24:12-13 )
“ మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును
.. మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.”
ఇశ్రాయేలీయులు- చాలా పెద్దవైన, బలమైన మరియు యుద్ధానికి శిక్షణ పొందిన అనేక శత్రు దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. అది వారి స్వంత శక్తి సామర్థ్యములతో కాదు. అయితే ఈ శక్తివంతమైన సైన్యాలను వదిలించుకోవడానికి దేవుడు దేవదూతల సైన్యాన్ని పంపించాడా? లేదు. కానిఆయన ఇశ్రాయేలీయుల కంటే ముందుగానే కందిరీగలను పంపారు, కాబట్టి వారు పోరాడాల్సిన అవసరం కూడా రాలేదు.
అయితే ఇప్పుడున్న నీ పరిస్థితులు ఎలా వుంటాయోనని నీవు తలంచలేని వాటిని గూర్చి చింతించకు. దేవుని దగ్గర రకరకాల సైన్యాలు ఉన్నాయి. నీవు ఎన్నడూ ఆలోచించని మార్గాలు ఆయన దగ్గర ఉన్నాయి. నీవు వాటిని గుర్తించడానికి ప్రయత్నించక , ఆయనపైన నమ్మకము పెట్టడానికి మాత్రము ప్రయత్నించు. ఆయన నీ జీవితాన్ని నియంత్రిస్తారు. నిన్ను ఎక్కడ చేర్చాలో ఎలా చేర్చాలో ఆయనకు తెలుసు. దేవుడే నీ ముందు వెళ్తున్నారు. చింతించడం మానుకో, నీ నిద్ర నుండి మేలుకో. నీ ఖడ్గాన్ని మరియు కవచాన్ని ధరించు. నీవు దున్నని భూమిని ఆయన నీకు ఇవ్వబోతున్నారు. నీవు కష్టపడాల్సిన అవసరం లేదు, నీ చాకచక్యము కాదు లేదా అది జరగాలని బలవంతం చేయనవసరములేదు. ఆయన నీ శోధకులను, శత్రువులను వెళ్లగొట్టబోతున్నారు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నేను పిలవకముందే మీరు నాకు జవాబిచ్చారు; నేను ప్రార్ధించడానికి ముందే సమాధానమిచ్చారు. మీరు నా ముందు వెళ్లి నేను ఊహించలేని విధంగా పని చేయుచున్నందులకు వందనములు. నేను మీ అపూర్వమైన అనుగ్రహంగల దేశంలోకి వస్తున్నానని నమ్ముతూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమెన్.