“ అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.”
( కీర్తనలు 106:13 )

ఒక యువకుడిగా, ఐగుప్తులో బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించాలని మోషేకు తెలుసు. అతనికి దేవుని నుండి వాగ్దానం ఉంది, కానీ అతనికి ఓపిక లేదు. అతను ఆతురతలో వుండి, ఒక హీబ్రూ బానిసతో పోట్లాడుతున్న వ్యక్తిని చంపాడు. మోషే హృదయం సరైనదే, కానీ అతను దేవుని సమయానికి దూరంగా ఉన్నందున, అతడు దేవుని చిత్తముకొరకు తన జీవితంకొరకు పారిపోవలసి వచ్చింది మరియు మిధ్యానుదేశములో నలభై సంవత్సరాలు వేచిఉన్నాడు.

నీ కలలు నెరవేరాలని విశ్వాసం కలిగి ఉండటం చాలా సులభం, కానీ సహనం లేని విశ్వాసం నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టుతూంది. నీవు నమ్ముతున్నది జరగటానికి నీవు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. అయితే విషయాలు జరిగేలా బలవంతం చేయడానికి ప్రయత్నించవద్దు. కానీ నీకు నీవు కల్పించుకొని, జనులను మార్చాలనే అవసరం లేదని మరియు నిన్ను ఇష్టపడేటట్లు వారిని ఒప్పించవలసిన అవసరములేదని నీవు గ్రహించాలి.
నిశ్చయముగా సరైన సమయంలో, విషయాలు చోటుచేసుకుంటాయి. అంతవరకు ఎదురుచూపుతో నీవు సిద్ధపడు మరియు దేవుణ్ణి నమ్ము - నీ కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితం కోసం తన ప్రణాళికను బయలుపరచే వరకు వేచిఉండు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, మీరు మంచి తండ్రి మాత్రమే కాదు, మీరు గొప్ప తండ్రి అని వందనములు చెల్లించుచున్నాను. మీరు తెరవెనుక పని చేస్తున్నారని మరియు సరైన సమయంలో నా జీవితానికి సంబంధించిన మీ ప్రణాళికను విప్పుతున్నందుకు వందనములు.
ఓపికగా వేచి ఉండటానికి నాకు సహాయపడమని మరియు మీరు ఎల్లప్పుడూ ప్రణాళికతో ‌ఉన్నారని నమ్ముచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.