నిరాశతో జీవించవద్దు

( యెషయా 14:27 )
“ సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?”

నీ జీవితములో దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది. ఆయన ఇప్పటికే నీ దినములన్నిటికి ప్రణాళిక వేశారు, మంచి ముగింపునకై విభిన్నమైన దృశ్యాలను వరుస క్రమములో ఉంచారు. ఈ దిన వాక్యములో "వాటిని ఎవరు ఆపగలరు? ఎవరు దానిని వెనక్కి తిప్పుతారు? అని చెప్పబడింది. దేవుడు సర్వ సృష్టిలో సర్వశక్తిమంతుడు. “ ఇప్పుడు, నీ జీవితం కోసం నా ప్రణాళికను ఎవరు ఆపగలరు? నీ ముగింపును ఎవరు మార్చగలరు? అని చెబుతున్నారు.
దానిని ప్రజలు చేయలేరు, అన్యాయమైన పరిస్థితులు చేయలేవు, విషాద కార్యములు చేయలేవు, నాదే చివరి మాట. "అని శెలవిస్తు‌న్నారు .

నీ జీవితం ప్రక్కత్రోవ పట్టినట్లు నీకు అనిపించిన , నీకు అర్థం కాని విషయాలతో ముగింపునకు వచ్చేసినట్లున్న, కలత చెందకు ఇంకా నిరాశతో జీవించకు. అది జీవితములో ఒక సన్నివేశం మాత్రమే. నీ జీవితంలోని అన్ని సన్నివేశాలు కలిసి వచ్చినప్పుడు, అది నీ మంచి కోసం పనిచేసిందని గుర్తించుతావు. ఎదురుదెబ్బలాగా అనిపించేదానిని ఆయన మార్పుచేసి దానిని నిజంగా నీ విధి యొక్క సంపూర్ణత కొరకు దేవుడు ఏర్పాటు చేయగలరు. దేవుడు నీ దశలను నిర్దేశిస్తున్నాడని తెలుసుకొని శాంతితో ఉండాలని నిశ్చయించుకో. ప్రక్కకుతిరగే మలుపులయినా,వేనుతిరుగే మలుపులయినా, ఇక ముగింపుగా కనబడినవయినా, సమస్తము నీ ప్రయోజనానికే పనిచేయించగలరు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, చివరకు మీరు ఎల్లప్పుడూ నన్ను విజయవంతం చేస్తారనే వాగ్దానమును బట్టి వందనములు. మీరు నా దశలను నిర్దేశిస్తున్నారని మరియు నా జీవితాన్ని మీ ఉద్దేశ్యముతో నడిపిస్తున్నందుకు వందనములు చెల్లించుచూ, నా జీవితములో మీ ప్రణాళికను ఆపగలిగేది ఏదీలేదని నమ్ముచూ యేసునామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.